ల..కొడుకా!! సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ భర్త తిట్ల దండకం.. ఎందుకు ఎవరిపైన అంటే..

by Kalyani |   ( Updated:2023-02-26 12:26:04.0  )
ల..కొడుకా!! సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ భర్త తిట్ల దండకం.. ఎందుకు ఎవరిపైన అంటే..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ భర్త జిందం చక్రపాణి, అధికార పార్టీ పవర్ ఫుల్ నాయకుడని ఏం చేసినా.. ఏం మాట్లాడినా చెల్లుతుంది.. అనుకున్నాడేమో మరీ.. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో బౌన్సర్లపై తిట్ల దండకంతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సినీ నటి యాంకర్ అనసూయ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కాగా వారిలో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ భర్త జిందం చక్రపాణి కూడా ఉన్నారు. కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో సరిగా గమనించని బౌన్సర్లు చక్రపాణిని వివరాల కోసం ప్రశ్నించారు.

దీంతో చక్రపాణి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. బౌన్సర్లను దుర్భాషలాడారు. లం.. కొడుకా నన్నే ఆపుతావా అంటూ తిట్ల దండకం చదివాడు. షాపింగ్ మాల్ నిర్వాహకులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, మరోసారి తీవ్ర పదజాలంతో తన ప్రతాపం చూపించారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఇలా సభ్యత మరిచిపోయి వ్యవహరించడంపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సదరు బీఆర్ఎస్ నేత గతంలోనూ ఇలాగే వ్యవహరించినట్లు పలువురు నాయకులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న కదా అని సామాన్యులపై ఇలా వ్యవహరించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేత వ్యవహార శైలి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed