మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

by Mahesh |   ( Updated:2022-11-10 07:02:19.0  )
మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లా నల్గొండ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదం

కూసుకుంట్ల ప్రమాణ స్వీకార ఉత్సవానికి అసెంబ్లీ లోనికి వెళ్లేందుకు టిఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. జిల్లా పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు వందమందిని లోనికి పంపించాలని కోరినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతించబోమని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులను తోసుకుని లోపలికి వెళ్ళగా తిరిగి నేతలను బయటకు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: తెలంగాణలో మోడీ.. ఢిల్లీ టూర్‌కు కేసీఆర్ ప్లాన్?

Advertisement

Next Story