KTR: రేపే రాజీనామా చేయడానికి సిద్ధం.. కేటీఆర్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
KTR: రేపే రాజీనామా చేయడానికి సిద్ధం.. కేటీఆర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఆదివారం సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల జీవితాలు ప్రశ్నార్థకం అయ్యాయని అన్నారు. ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) బతుకమ్మ చీరలు(Bathukamma Sarees) కూడా ఆర్డర్ ఇవ్వట్లేదని అన్నారు.

ఇప్పటికే అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. ఇంకెంత మంది చనిపోతే ప్రభుత్వానికి సిగ్గు వస్తుందని అన్నారు. ‘సిరిసిల్లలో నేను ఎమ్మెల్యేగా ఉండటం మీకు ఇష్టం లేకపోతే రేపే రాజీనామా చేయడానికి సిద్ధం’ అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. సిరిసిల్ల(Sirisilla) ప్రజలపై ప్రభుత్వం కక్ష గట్టిందని అన్నారు. పథకాలు రద్దు చేసి నేతన్నలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed