ఓఆర్ఆర్ కాంట్రాక్టులో.. కేసీఆర్ బ్లెస్సిగ్స్‌తో కేటీఆర్ కుట్ర : రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-24 07:46:26.0  )
ఓఆర్ఆర్ కాంట్రాక్టులో.. కేసీఆర్ బ్లెస్సిగ్స్‌తో కేటీఆర్ కుట్ర : రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. లక్ష కోట్ల విలువ కలిగిన ఔటర్ రింగ్ రోడ్డును కొల్లకొట్టేందుకు మంత్రి కేటీఆర్ కుట్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ ఆశీర్వదిస్తున్నాడన్నారు. ఈ తతంగానికి సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్‌లు సహకరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ 30 ఏళ్ల టోల్ కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయని కేటీఆర్ చెప్పిన సంస్థకు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వేల కోట్ల విలువైన కాంట్రాక్టులపై ఎలా సంతకాలు చేస్తారని ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ కాంట్రాక్టును చూపి ఐఆర్‌బీ సంస్థ.. దాని 49 శాతం వాటాను సింగపూర్ సంస్థకు వేల కోట్లకు అమ్మేసుకుందని ఐఆర్‌బీ సంస్థకు, సింగపూర్ సంస్థకు, షెల్ సంస్థకు ఉన్న లింకులేంటో తేలాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతున్నదంతా పచ్చి అబద్దం అని అక్రమంగా సంపాధించుకున్న వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ యూకే, యూఎస్ఏలో పర్యటిస్తున్నారని ఆరోపించారు.

విదేశీ పర్యటనల్లో గూడుపుఠాణి సమావేశాలు పెట్టుకుంటున్నారని కేటీఆర్ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు రాజులు ఎక్కడ ఉన్నారో ఆ వివరాలను ప్రభుత్వం భయట పెట్టగలదా అని ప్రశ్నించారు. ఎల్లుండి లోపు ఐఆర్‌బీ సంస్థ 10 శాతం హెచ్ఎండీఏకు చెల్లించాలని లేకపోతే నిబంధనల ప్రకారం వెంటనే టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ కాంట్రాక్టు వెనుక ఉన్న మర్మం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందన్నారు.

కేసీఆర్ అవినీతి బయటకు తీస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చెబుతున్నారని ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇంత దారి దోపిడి జరుగుతుంటే కేంద్ర హోం శాఖను విచారణ చేయమని కోరడం లేదని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ, కాగ్ సంస్థలకు ఇస్తామన్నారు. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేశాకే జీవో ఎత్తివేశారని ఆరోపించారు. 2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో కొనుగోలు చేసిన భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేత్తపై ఎన్జీటీకి వెళ్తామన్నారు. ఏ పార్టీ నేతలైనా సరే ఈ జీవో పరిధిలో భూములు కొన్న వారి వివరాలు బయట పెట్టాలన్నారు.

Advertisement

Next Story