చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు KTR విషెస్.. నెట్టింట మాస్ ట్రోలింగ్

by Rajesh |   ( Updated:2024-06-07 05:16:36.0  )
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు KTR విషెస్.. నెట్టింట మాస్ ట్రోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలకు సేవల చేయాలని కాంక్షించారు. ఇక, ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘జగన్ గెలుస్తాడని మీకు, మీ నాన్నకు సమాచారం ఇచ్చింది ఎవరు బ్రో’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘0’ ఎంపీ సీట్లు ఏంటి బ్రో దారుణంగా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఏమాయే టిల్లు షో ఎంజాయ్ చేశావా’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

‘నువ్వు కామెడీ షోలు చూడటం మానేయ్ బ్రో..’ ‘ఎలా ఉంది కేటీఆర్.. సీబీఎన్ విక్టరీ ఇప్పుడు అయిన బలుపు మాటలు తగ్గించుకో’ అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా హైటెక్ సిటీ వద్ద కొంత మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ధర్నాకు దిగడంతో నిరసనలు ఏమన్నా ఉంటే రాజమండ్రికి వెళ్లి చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వేళ ఓ షోను తాను ఎంజాయ్ చేసినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ రెండు అంశాలు ఏపీ ప్రజల కోపానికి కారణమయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed