Yennam Srinivas Reddy: బామ్మర్దిని వెనుకేసుకొస్తే కేటీఆర్ నీ రాజకీయ జీవితం సమాధే: యెన్నం

by Prasad Jukanti |
Yennam Srinivas Reddy: బామ్మర్దిని వెనుకేసుకొస్తే కేటీఆర్ నీ రాజకీయ జీవితం సమాధే: యెన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు (anwada Farm House Case) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) మండిపడ్డారు. సెర్చ్ వారెంట్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం ఆయన తెలివి తక్కువ తనం అని, ఎలాంటి మాచారం ఇవ్వకుండా తనిఖీ చేసే హక్కు అధికారులకు ఉంటుందన్నారు. రాజ్ పాకాల లేకుండా ఆయన ఇంట్లో పార్టీ అంటే నవ్వొస్తున్నదన్నారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన యెన్నం.. రాజ్ పాకాల చరిత్ర మాకు తెలియనిదా అని ప్రశ్నించారు. ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగించినట్లు తెలిందని తనకు పరీక్షిస్తే తాను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతానని భయంతోనే రాజ్ పాకాల తప్పించుకుని పారిపోయారన్నారు. ఘటన జరగ్గానే రాజ్ పాకాల (Raj Pakala,) మీడియా ముందుకు వచ్చి అక్కడ ఏం జరిగింతో చెప్తే ఇవాళ కేటీఆర్ చెప్తున్న మాటలకు కనీసం అర్థం పర్థం దక్కేదన్నారు.

బావమరిది తప్పు చేస్తే కేటీఆర్ ను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయవద్దన్నారు. బావమరిదిని వెనుకేసుకొస్తే ఎంతో భవిష్యత్ ఉన్న మీకు రాజకీయ భవిష్యత్ కు సమాధి తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ లో పబ్ లకు పర్మిషన్ ఇప్పించిందే రాజ్ పాకాల అన్నారు. అధికారులు దర్యాప్తు చేయడం తప్పా? ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారుల ప్రమేయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో స్ట్రింగ్ ఆపరేషన్ జరగలేదని ఫిర్యాదు మేరకే పోలీసలు దాడి చేశారన్నారు. స్ట్రింగ్ ఆపరేషన్ అనేది మీ హయాంలో ప్రారంభించినవే కదా అన్నారు. రాజ్ పాకాల ఇస్తేనే తాను డ్రగ్స్ తీసుకున్నానని విజయ్ మద్దూరు చెప్పారని ఇది చాలా సీరియస్ విషయం అన్నారు. ఇది అబద్ధం అయితే వెంటనే రాజ్ పాకాల పోలీసులకు లొంగిపోవాలని లేకుంటే ఇది నిజం అని తెలంగాణ సమాజం నమ్మె పరిస్థితి ఉంటుందన్నారు. ఏం జరిగిందో వివరంగా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందన్నారు. ఎదురు దాడి అన్నింటిలో పనికి రాదని కేటీఆర్ గుర్తించాలన్నారు. సమాజం కోసం నిజాయితీగా ఉండాలన్నారు. ఎదురుదాడి చేయి గాయి గాయి చేస్తే చర్చ పక్కదారి పడుతుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లేనన్నారు. పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) చెప్పిన పొలిటికల్ బాంబులు ఇవి కావని ఇవి వారి సెల్ఫ్ గోల్ మాత్రమేనన్నారు. పొలిటికల్ బాంబు అంటే కాళేశ్వరం, ఎలక్ట్రిసిటీ, భూదాన్, ఈడీ, హవాలా బాంబులు ఉంటాయన్నారు.

ప్రభుత్వ అవినీతిని తాము ప్రశ్నిస్తుంటే మాపై కక్ష్యసాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతున్నదన్న హరీశ్ రావు వ్యాఖ్యలకు యెన్నం కౌంటర్ ఇచ్చారు. స్టార్టే కానీ మూసీ ప్రాజెక్టులో లక్షా 50 వేల కోట్లు అని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే కాళేశ్వరం, విద్యుత్, భూదాన్ భూముల స్కామ్ లు బయటకు వస్తుందన్నారు. ఈ స్కామ్ లన్ని చేయించింది మీరు మీ చుట్టూ ఉన్నవారేనని ఆరోపించారు. మూసీలో ప్రభుత్వం యాక్షన్ ప్లానే రెడీ చేయకముందే ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నదన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed