బొగ్గు గనుల అమ్మకంపై కేటీఆర్ ట్వీట్.. CM రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Rajesh |
బొగ్గు గనుల అమ్మకంపై కేటీఆర్ ట్వీట్.. CM రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్ : బొగ్గు గనుల వేలానికి డిప్యూటీ సీఎం భట్టి వెళ్లడాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘కేటీఆర్ గారూ.. 10 సంవత్సరాలుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజలు మాట్లాడిన మాటలను వినడానికి మీరు ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి.. మీరు ఇప్పుడు వాస్తవాలను వినడానికి శ్రద్ధ చూపే ఛాన్స్ లేదు. కానీ తాము వినడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వం లేదా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటీకరణ లేదా మన వాటాలను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

సింగరేణి బ్లాక్‌లను విక్రయించే మొదటి, రెండవ విడతలను కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు విక్రయించారు. ఈ అంశమై మీరు లేదా మీ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి బ్లాకులను మరింత ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించడమే కాకుండా అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాకును రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కుల భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయి. మన బొగ్గు మాత్రమే కాకుండా మన ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం.. సింగరేణి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కలెక్షన్ హక్కులను అమ్మిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు.. అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story