కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్.. రేపు అసెంబ్లీకి!

by GSrikanth |
కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్.. రేపు అసెంబ్లీకి!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. సోమవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు, టెస్టుల్లో నెగెటివ్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, రేపటినుంచి (మంగళవారం) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సంపూర్ణ ఆరోగ్యంగా కరోనా నుంచి కోలుకోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story