- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR: చిరుద్యోగులకు వెంటనే వేతనాలు చెల్లించాలి.. బీఆర్ఎస్ నేత డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: వేతనాలు పెండింగ్ లో పెడితే చిరుద్యోగుల జీవనం ఎలా సాగుతుందని, చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెండింగ్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వారికి వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు! అని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా జీతాల్లేవని తెలిపారు.
పంచాయతీ వర్కర్స్, మున్సిపాలిటీ కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్ ఇలా ప్రతీ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు విలవిలలాడుతున్నారని, కుటుంబాలను నెట్టుకురావడానికి అప్పులు చేసి నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని పలికిన ప్రగల్భాలు ఎటుపోయాయని, దసరా దగ్గరికి వచ్చినా.. సరుకులు కొనడానికి చేతిలో నయాపైసా లేదని అన్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడితే బతుకు బండి నడిచేదెట్లా అని, 10 నెలల్లో తెచ్చిన 80వేల కోట్లు అప్పులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చిరుద్యోగులు.. చిన్నజీతాల కార్మికుల అవస్థలను పట్టించుకోవాలని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని కేటీఆర్ కోరారు.