జర్నలిస్టులపై నెట్టింట విమర్శలు.. కఠిన చర్యలకు ఆదేశించిన కేటీఆర్

by Sathputhe Rajesh |
జర్నలిస్టులపై నెట్టింట విమర్శలు.. కఠిన చర్యలకు ఆదేశించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియాలు ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుండటం చూస్తూనే ఉంటాం. అయితే, కొందరు జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తుండటంతో కొందరు శ్రేణులు జీర్ణించుకోలేక ఎదురు దాడికి దిగుతున్నారు. ఇందులో భాగంగా ఓ మహిళ జర్నలిస్టు తమపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌ను తెలియజేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ట్వీట్ ప్రకారం.. '' నేను ఉమెన్ జర్నలిస్టును కాబట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్ లైన్లో వేధిస్తున్నారు. జర్నలిస్టు శంకర్‌ను ఏకంగా యాక్సిడెంట్ చేస్తారంట. ఇప్పిటికైనా చర్యలు తీసుకోండి.'' అని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. గౌరవప్రద వృత్తిలో ఉన్న జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అవమాన కర పోస్టులు చేయడం మంచిది కాదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని, తెలంగాణ డీజీపీకి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed