తెలంగాణతో KTRకు పేరు, పేగు బంధం లేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
తెలంగాణతో KTRకు పేరు, పేగు బంధం లేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ తనను గాడ్సేతో పోల్చడంపై రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఉద్యమానికి కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేటీఆర్ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అరువు తెచ్చుకున్నదే అన్నారు. తెలంగాణలో చదువుకోలేదన్నారు. తెలంగాణతో కేటీఆర్ కు పేరు బంధం కానీ, పేగు బంధం కానీ లేదన్నారు. కేటీఆర్ చదువు గుంటూరులో అని ఉద్యోగం అమెరికాలో చేశాడన్నారు. 6 పాయింట్ ఫార్ములా నుంచి 610 జీవో వరకు తెలంగాణలో కేటీఆర్‌కు ఏ హోదాలో కొనసాగేందుకు అర్హత లేదన్నారు.

Advertisement

Next Story