- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: అప్పులపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) సర్కార్ చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంపై రూ.3.90 లక్షల కోట్ల అప్పు ఉందంటే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్ల అప్పు ఉందంటూ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అప్పుల లెక్కలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. అందుకే ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని స్పష్టం చేశారు. ప్రతి విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ (Protocol) పాటించడం లేదని ఫైర్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో ఓడిన అభ్యర్థులను కూడా వేదికలపైకి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌ను కోరామని కేటీఆర్ (KTR) తెలిపారు.