Manchu Manoj : మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ! అక్కడి నుంచే ప్రకటన?

by Bhoopathi Nagaiah |
Manchu Manoj : మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ! అక్కడి నుంచే ప్రకటన?
X

దిశ, డైనమిక్ బ్యూరో : మంచు ఫ్యామిలీ వ్యవహారం కొత్త మొలుపు తిరిగింది. నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందని రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి ఆయన తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని సమాచారం. భూమా ఘాట్​వద్ద తమ రాజకీయ ప్రవేశం గురించి మనోజ్, మౌనిక ప్రకటించే అవకాశం ఉందని మౌనికరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. మంచు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బలపడాలని భావిస్తున్నారని సమాచారం. ఇవాళ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారీ కాన్వాయ్‌తో వెళ్లిన వారు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించనున్నారు. తన ఇంట్లో జరుగుతున్న వరుస ఘటనలతో రాజకీయ అండ కోసం ఓ పొలిటికల్ పార్టీలో చేరాలని వారిద్దరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బలపడితే తమకు కొంత భరోసా దొరుకుతుందని మనోజ్ భావిస్తున్నారు.

జనసేనా... టీడీపీలోకా..?

ఆళ్లగడ్డ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున మౌనిక సోదరి అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014-2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు మంచు మనోజ్‌కు మంచి సంబంధాలున్నాయి. దీంతో మనోజ్ జనసేనలో లేదా టీడీపీలో చేరాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనోజ్ తండ్రి మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆ తర్వాత మోహన్​ బాబు కుటుంబం ఓసారి ప్రధాని మోడీని కూడా కలిసింది.

Advertisement

Next Story

Most Viewed