Mohan Babu : గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు

by M.Rajitha |   ( Updated:2024-12-16 13:05:57.0  )
Mohan Babu : గన్ సరెండర్ చేసిన మోహన్‌బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు నటుడు మోహన్‌బాబు(Mohan Babu) తన గన్(Gun) పోలీసులకు సరెండర్ చేశారు. సోమవారం మోహన్‌బాబు వివాదంపై రాచకొండ సీసీ సుధీర్‌బాబు(Rachakonda CP SudheerBabu) సీరియస్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ విషయంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ సమర్పించడానికి 24వ తేదీ వరకు గడువు కోరారని, ఆలోపు విచారణపై కోర్ట్ అనుమతి అడుగుతామని అన్నారు. కాగా రాచకొండ పరిధిలో మోహన్‌బాబుకు గన్‌ లైసెన్స్‌ లేదని, అలాగే ఆయన వద్ద రెండు గన్స్ ఉన్నాయని.. ఈ విషయంపై మరోసారి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు తన వద్ద ఉన్న గన్ కాసేపటి క్రితం రాచకొండ పోలీసులకు సరెండర్ చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed