- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెవిలో పువ్వులతో నిరసన..ఎందుకంటే..?
దిశ,నల్లగొండ: నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు ఆందోళన చేశారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ..ఏడవ రోజు నిరవధిక సమ్మె ఉదృతంగా కొనసాగించారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది, నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని తెలిపారు. అయినా సరైన వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఎం సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన వినాలని, రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తమకు న్యాయం చేయాలని,లేకపోతే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు. గత సంవత్సరం అంతా 13.09.2023 న హన్మకొండ లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, తమ విలువైన జీవిత కాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి - సమాన వేతనం వెంటనే అమలు చేయాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం హామీని అమలు చేసే వరకు నిరవధిక దీక్షను ఇలాగే కొనసాగిస్తామని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ,బొమ్మగాని రాజులు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాణాలు రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియే ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, గౌరవ సలహాదారులు డి. నీలాంబరి పాల్గొన్నారు. మహిళ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళ అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు,సిపిఎం జిల్లా నాయకులు ఎండి సలీం,దండంపల్లి సత్తయ్య,తుమ్మల పద్మఔటర్ రవీందర్,అద్దంకి నరసింహ,గాదె నరసింహకోట్ల అశోక్ రెడ్డి,గంజి నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్ జగదీష్ చంద్ర. ప్రధాన కార్యదర్శి శ్యాంసుందవర్, గౌరవ అధ్యక్షులు గోవర్ధన్, జిల్లా కోశాధికారి ఎండి ఖాదర్ హాజరై మద్దతు తెలిపారు.