- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pain perception : మనం నొప్పిని ఎందుకు తట్టుకోగలుగుతాం..? ఇవిగో కొన్ని కారణాలు!
దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా నిప్పును తాకి మంటగా అనిపించడంతో వెంటనే వెనక్కి తగ్గిన సందర్భాలున్నాయా? వింటర్‌లో ఉదయాన్నే బయటకు వెళ్లి చివరికి చలికి తట్టుకోలే ఇబ్బంది పడ్డారా? చిన్నప్పుడు లేదా పెద్దయ్యాక కూడా చాలా మంది తమ జీవితంలో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయినప్పటికీ వాటికి భయపడి రోజువారీ పనులను ఎవరూ మానేయరు. చలి, వేడి ఎక్కువగా ఉన్నా.. ఆయా వాతావరణ పరిస్థితులను ఓర్చుకుంటూ, వాటిని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకుపోతుంటారు. ఒక విధంగా బాధను లేదా నొప్పిని మనుషులు ఓర్చుకోగలరని సైన్స్ కూడా చెబుతోంది. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. నొప్పిని సహించే విధానం పర్సన్ టు పర్సన్ మారుతుందని నిపుణులు అంటున్నారు. పెయిన్‌ను కొందరు ఎక్కువగా ఫీల్ అయితే మరికొందరు తక్కువగా ఫీల్ అవ్వొచ్చు. మొత్తానికి నొప్పి, ప్రభావం, సహనం వంటి అంశాలను అర్థం చేసుకోవడం మన మెరుగైన ఆరోగ్యానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
నొప్పిని తట్టుకోవడం అంటే?
నొప్పిని సహించడం(pain tolerance) లేదా తట్టుకోవడం అనేది ఒక వ్యక్తి సహేతుకంగా హ్యాండిల్ చేయగల పెయిన్ మొత్తంగా పేర్కొనవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఇది బాధాకరంగా ఉండవచ్చు. అయినప్పటికీ సహించదగ్గదిగా ఉంటుంది. అధిక నొప్పిని ఓర్చుకోగల వ్యక్తులు సాధారణ లేదా తక్కువస్థాయి నొప్పిని తట్టుకోగల వారికంటే ఆ బాధను మెరుగ్గా మేనేజ్ చేయగలరు. అయితే నొప్పిని తట్టుకోవడం ‘పెయిన్ థ్రెషోల్డ్’తో సమానమా..? అంటే కాదు. నొప్పిని ఓర్చుకోవడం, పెయిన్ థ్రెషోల్డ్ రెండు వేర్వేరు విషయాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ థ్రెషోల్డ్ అనేది ఒక ఉద్దీపన. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా మారుతూ ఉంటుంది.
అధిక నొప్పిని ఎందుకు సహిస్తాం
పెయిన్ అనేక రూపాల్లో ఉంటుంది. అయినా చాలా వరకు మనం మానసిక, శారీరక నొప్పులను తట్టుకోగలం. భరించగలం. అధిగమించగలం.. అయితే అవి ప్రభావితం చేసే విధానం మాత్రం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకిలా అంటే.. మనం నొప్పిని ఓర్చుకోవడంలో జన్యుపరమైన అంశాలు కూడా కీ రోల్ పోషిస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తి అనుభవించే నొప్పి ఉద్దీపన(stimulus experienced ) రకాన్ని బట్టి దాని ప్రభావం, ఫలితాలు మారవచ్చు. అలాంటి వాటిలో ఏజ్, జెండర్ కూడా కీలకపాత్ర పోషిస్తాయి. నొప్పిని సహించడంలో వయస్సు ఎలా ప్రభావితం అవుతుందంటే.. ఉదాహరణకు పిల్లలకంటే పెద్దులు ఎక్కువ నొప్పిని సహిస్తారు లేదా ఓర్చుకుంటారు. ఇక జెండర్ విషయానికి వస్తే.. ఒక అధ్యయనం ప్రకారం పెయిన్ సెన్సిటివిటీని నివేదించే మహిళల్లో వేరియబుల్స్ ఉంటాయి. కొన్ని విషయాల్లో మహిళలు ఎక్కువ పెయిన్‌ను ఓర్చుకుంటే.. మరికొన్ని విషయాల్లో పురుషులు ఎక్కువగా ఓర్చుకునే అవకాశం ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. హార్మోన్లు, సోషల్ ఫ్యాక్టర్స్, స్త్రీ, పురుషుల్లోని ఫిజికల్ అండ్ న్యూరానల్ డిఫెరెన్సెస్ (ad physical and neuronal differences) నొప్పిని ఓర్చుకోవడంలో వ్యత్యాసాలను ప్రభావితం చేస్తాయి.
ఒత్తిడి, నొప్పి, అనుభవం
స్ట్రెస్ కూడా నొప్పిని ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి అధిక ఒత్తిడిలో మరింత ("on edge") నొప్పిన అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక ఎక్స్‌పెక్టేషన్ లేదా నిరీక్షణ అనేది కూడా పెయిన్‌ను అనుభవించడంలో కీ రోల్ పోషిస్తుంది. ఉదాహరణకు ఏదైనా మరింత బాధాకరంగా ఉంటుందని ఫీలయ్యే వ్యక్తి దానిని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఒకసారి నొప్పిని అనుభవించిన వ్యక్తులు భవిష్యత్‌లో మరోసారి దానిని ఎలా ఎదుర్కోవాలో లేదా తట్టుకోవాలో అనే అవగాహనను కూడా నేర్పిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులు. భిన్నమైన వాతావరణం బాధగా ఉన్నా మనం ఓర్చుకుంటాం. కొందరు డిప్రెషన్, యాంగ్జైటీస్ సహా మానసిక ఆరోగ్య సమస్యలతో ఎక్కువ పెయిన్‌ను అనుభవించవచ్చు. ఇక దీర్ఘకాలిక అనారోగ్యం కూడా నిర్దిష్ట నొప్పికి హైపర్ సెన్సిటివిటీని కలిగిస్తుంది. అలాగే ఇతర కారకాలు కూడా మన శరీరం నొప్పిని ఎలా అనుభవించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు. తీసుకునే మందుల నుంచి నిద్రలేమి, జీవన శైలిక ఎంపికల వరకు నొప్పి లేదా బాధలను సహించడంలో హెచ్చు తగ్గులకు కారణం కావచ్చు. కొంతమందిలో నొప్పిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. గత అనుభవాలు, జన్యుపరమైన కారణాలు ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఒక వ్యక్తి నొప్పిని సహించగల శక్తిని కొలిచే కొన్ని మార్గాలు ఏమిటి? అన్నప్పుడు డోలోరిమెట్రీ (dolorimetry), కోల్డ్ ప్రెస్సర్స్ (cold pressor) వంటి పద్ధతులు ఉన్నాయి.
తట్టుకునే మార్గాలు
నొప్పి లేదా బాధలను ఓర్చుకోవడాన్ని మెరుగు పరిచే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఏరోబిక్ ఎక్సర్‌సైజ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ సర్క్యూట్ ట్రైనింగ్ వంటివి ఆరోగ్యంగా ఉన్నవారిలో నొప్పిని తట్టుకునే శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే యోగా మన మైండ్ అండ్ బాడీ గురించి మరింత తెలుసుకోవడంలో సహాయపడటం ద్వారా కొన్ని పెయిన్ డ్రైవ్ (pain-driven) రెస్పాన్సెస్‌ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాధలను ఫీలవడం, ఏడ్వడం వంటివి కూడా పెయిన్ రిలీఫ్ కలిగిండచం ద్వారా నొప్పిని తట్టుకునేలా చేస్తాయి. ఉదాహరణకు ఏదైనా దెబ్బ తగలినప్పుడు, గాయపడినప్పుడు విదేశాల్లో అయితే ‘ఓవ్ (ow)’ అని అరవడం ద్వారా నొప్పి కొంత వరకు తగ్గుతుందని ది జర్నల్ ఆఫ్ పెయిన్ (The Journal of Pain) అధ్యయనం పేర్కొంటున్నది. మన విషయానికి వస్తే.. ఏదైనా బాధ లేదా నొప్పిని అనుభవించినప్పుడు ‘అమ్మా.., అబ్బా.., వామ్మో.., అయ్యో.., ’ అనే పదాలను యూజ్ చేస్తుంటారు. చాలా వరకు అందరూ అమ్మా అనే అంటారు. ఇది నొప్పి ప్రభావాన్ని వెంటనే కొంత తగ్గించడంలో సహాయపడుతుంది.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Warning Signs : నిద్రలేవగానే వికారంగా అనిపిస్తోందా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!