Payal Shankar: సర్కార్ స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు

by Gantepaka Srikanth |
Payal Shankar: సర్కార్ స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 50 శాతం మందికి కూడా రుణమాఫీ జరగలేదని, ఈ అంశంపై సర్కార్ ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శలు చేశారు. బీఏసీ సమావేశంలో ఆయన సోమవారం పలు అంశాలపై ప్రస్తావించారు. సభలో రెండు లక్షల రుణమాఫీపై చర్చించాలని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న 317 జీవో సమస్యలపై చర్చ జరగాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధి అవకాశాలపై చర్చకు డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ప్రతి రోజు జీరో హవర్ నిర్వహించాలన్నారు. రూ.5 లక్షల బిల్లుకు సైతం ఆర్థికమంత్రి కనుసైగ చేసే పరిస్థితికి దిగజారిందని విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంపైనా చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story