Diesel Tanker : రోడ్డు పాలైన వేలాది లీటర్ల డీజిల్! సికింద్రాబాద్‌లో ట్యాంకర్ బోల్తా

by Ramesh N |
Diesel Tanker : రోడ్డు పాలైన వేలాది లీటర్ల డీజిల్! సికింద్రాబాద్‌లో ట్యాంకర్ బోల్తా
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Secunderabad) సికింద్రాబాద్‌లో ఓ డీజిల్ ట్యాంకర్ (Diesel tanker) బోల్తా కొట్టి.. వాహనదారులకు చుక్కలు చూపించింది. ఇవాళ మెట్టుగూడ రైల్ నిలయం మార్గంలొ డీజిల్ ట్యాంకర్ బోల్తా (Tanker Overturns) పడటంతో వేలాది లీటర్ల డీజిల్ వృధా అయింది. వందల లీటర్ల డీజిల్ అంతా రోడ్డుపై పారడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్పీడ్‌గా వాహనాలు డీజీల్‌పై నుంచి వెళితే ఏదైన జరిగే ప్రమాదం ఉంది. దీంతో ఆ ప్రాంతంలో నెమ్మదిగా కదలడం తో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. అదేవిధంగా ప్రమాదం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. కాగా, డీజిల్ ట్యాంకర్ బోల్తా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే వాహనం బోల్తా కొట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed