Textationship : మాటలుండవ్.. చేతలుండవ్.. ఓన్లీ మెసేజ్ లే!!

by Javid Pasha |   ( Updated:2024-12-16 15:40:26.0  )
Textationship : మాటలుండవ్.. చేతలుండవ్.. ఓన్లీ మెసేజ్ లే!!
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితంలో లెక్కలేనన్ని మార్పులు తెచ్చింది. చాలా వరకు సానుకూలమైనవే అయినప్పటికీ అక్కడక్కడా కొన్ని ప్రతికూలతలూ ఉంటున్నాయి. నెగెటివ్ అంశాలు పక్కన పెడితే ప్రస్తుతం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మాటిక్ అండ్ కమ్యూనికేషన్ మాధ్యమంగా టెక్నాలజీ మానవ శ్రేయస్సుకు దోహదం చేస్తోంది. అనేక విషయాల్లో దానిని ప్రజలు యూజ్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనుషుల్లో కొత్త ఆలోచనలు, Gen Zలో కొత్త పోకడలు కూడా పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిలో తాజాగా పుట్టుకొచ్చిన మరో ట్రెండ్ టెక్ట్సేషన్‌షిప్ (Textationship). ఒక విధంగా చెప్పాలంటే న్యూ జనరేషన్‌లో ఇది మరో ‘రిలేషన్‌షిప్‌’గా మారుతోంది. చాలా మంది నెలలు, సంవత్సరాల తరబడి ప్రత్యక్షంగా కలుసుకోరు.. ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోరు కానీ మనసులోని మాటలను, భావాలను టెక్ట్స్ రూపంలో పంచుకుంటారు. ప్రస్తుతం యువతను ఇది ఎలా ప్రభావితం చేస్తోందో చూద్దాం.

టెక్ట్స్‌టేషన్‌షిప్ అంటే?

టెక్స్‌టేషన్ కూడా ఒక రకమైన సంబంధంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ ప్రత్యక్షంగా ఉండదు. ఎప్పుడూ కలిసి మాట్లాడుకోరు. అయితే తమ భావాలు, ఆలోచనలు, పర్సనల్ విషయాలు, ఫీలింగ్స్, ఇంటిమేట్ మూమెంట్స్ వంటివన్నీ ఏదో ఒక మెసేజింగ్ యాప్ లేదా ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంచుకుంటారు. ఇక్కడ కూడా ఫేస్ టూ ఫేస్ మీటింగ్‌లు, వీడియో కాల్స్ మాట్లాడటం వంటివి ఉండవు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన సంబంధం ఉంటుంది. భార్యా భర్తలు లేదా ప్రేమికుల్లా అన్నీ షేర్ చేసుకుంటారు కానీ.. ఓన్లీ టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారానే. భావోవ్వేగాలను కూడా ఇలాగే వ్యక్తం చేస్తుంటారు.

ఎందుకంత పాపులర్?

ఈతరం (Gen Z)లో టెక్నాలజీపై అవగాహన ఎక్కువ. పైగా అది ఈజీగా యాక్సెస్ చేయగల రూపంలో అందుబాటులో ఉంటోంది. కాబట్టి ట్రెడిషనల్ పద్ధతులకంటే డిజిటల్ కమ్యూనికేషన్‌ను చాలామంది ఇష్టపడుతున్నారు.టెక్స్‌టేషన్షిప్ రిలేషన్‌షిప్‌కు ఇదీ ఒక కారణమే. ఎలా వెళ్లాలి? ఎప్పుడు కలుద్దాం? కలిసి మాత్రమే మాట్లాడుకుందాం అనే ఒత్తిడి ఉండదు. పైగా మెసేజెస్ చేయడం ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. అయితే కమిట్‌మెంట్స్ ఉండవు. కొంత ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి అట్రాక్టివ్ ట్రెండ్‌గా ఈ జనరేషన్‌లో పాపులర్ అయిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఎంతైనా ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకోవడంలో ఉండే కిక్ ఉండదు. బాడీ లాంగ్వేజ్, భావాలు పంచుకునే క్రమంలో పరస్పరం వినడం, హావ భావాలు వంటివి టెక్ట్సింగ్‌లో ఉండవు. సో.. ఎమోషనల్ డెప్త్ అంతగా ఉండదు. ఇక టెక్ట్స్‌టేషన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు అరుదుగా కలుసుకున్నప్పటికీ ట్రెడిషనల్ రిలేషన్‌లో ఉండే లోతైన ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ ఉండవు.

Read More...

30 రోజుల్లో సెకండ్ మ్యారేజ్.. ‘డబుల్’ పెళ్లి చేసుకోని నిరూపించిన నవ దంపతులు!




Advertisement

Next Story