‘తగ్గేదే లే కాదు.. కొంచం తగ్గు’.. ఆలోచింపజేస్తున్న బన్నీ అభిమాని మాటలు (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-16 15:46:51.0  )
‘తగ్గేదే లే కాదు.. కొంచం తగ్గు’.. ఆలోచింపజేస్తున్న బన్నీ అభిమాని మాటలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjan) పుష్ప సినిమాలోని ఐకానిక్ ‘తగ్గేదే లే’ డైలాగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్‌కు సినీ అభిమానులే కాదు.. రాజకీయ నాయకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల నేతలు ఈ డైలాగ్‌ను వాడి కార్యకర్తల్లో జోష్ నింపి ఓట్లు దండుకున్నారు. తాజాగా.. ఇదే డైలాగ్‌తో అల్లు అర్జున్‌కు స్వయంగా ఆయన అభిమానే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అల్లు అర్జున్ గారు.. మీ అభిమానిగా చెబుతున్నాను. కొంచం తగ్గండి. 6 గంటలు జైలులో ఉన్నందుకే మిమ్మల్ని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా పరామర్శించారు. పరామర్శల పేరుతో చాయ్‌లు తాగుకుంటూ హ్యాపీగా గడిపారు. అక్కడ ఓ బాలుడు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాటం చేస్తున్నాడు. అసలు మీకు నవ్వు ఎలా వస్తుంది. మీ మూలంగా ఆ బుడ్డోడు ఇవాళ ఆస్పత్రి పాలయ్యడు. కోర్టులో కేసు ఉన్నా సరే.. మీరు వెళ్లి ఆ బాలుడిని పరామర్శించి పాదాలకు నమస్కారంతో పాటు క్షమాపణ చెప్పాలి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా ‘వెరీ గుడ్ తమ్ముడు భలే చెప్పావ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Advertisement

Next Story