Cabinet Meeting : కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం

by M.Rajitha |
Cabinet Meeting : కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినేట్ సమావేశం(Telangana Cabinet Meeting) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశం అయి, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 5 ఆర్డినెన్స్‌(Ordinance)లకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఓఆర్ఆర్(ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయితీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసే కీలక ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. అలాగే పంచాయతీరాజ్ చట్టానికి(Pachayithi Raj Act) కూడా ఆమోదం తెలపనున్నారని సమాచారం. కాగా ఆరు రోజుల తర్వాత మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశం.. రేపటికి వాయిదా పడింది. మరోవైపు మండలి సమావేశం కాసేపటి క్రితం ప్రారంభం అయింది.

Advertisement

Next Story

Most Viewed