- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Billion Club: 100 బిలియన్ డాలర్ క్లబ్‌లో స్థానం కోల్పోయిన అంబానీ, అదానీ
దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఇద్దరూ భారత్‌తో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నులు. అయితే, వీరిద్దరి వ్యాపారాలు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ప్రముఖ బ్లూమ్‌బర్గ్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో స్థానం కోల్పోయారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ సంపద సూచీ వెల్లడించింది. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తమ వ్యాపారాల్లో కీలక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంబానీకి చెందిన కీలక రంగాలు ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల్లో రుణాలు పెరగడంతో ఇన్వెస్టర్ల నుంచి ప్రతికూల ప్రభావాన్ని చూస్తోంది. దీనివలా ఆయన సంపద జూలైలో 120.8 బిలియన్ డాలర్ల(రూ.10 లక్షల కోట్ల) నుంచి డిసెంబర్ 13 నాటికి రూ. 8.2 లక్షల కోట్ల)కు తగ్గింది. ఇక, గౌతమ్ అదానీ ఇటీవల అమెరికా కోర్టులో లంచం ఆరోపణలను ఎదుర్కోవడంతో కొత్త ఒప్పందాలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో జూన్‌లో 122.3 బిలియన్ డాలర్లు(రూ. 10.3 లక్షల కోట్లు) ఉండగా, తాగా 8.21 బిలియన్ డాలర్ల(రూ. 7 లక్షల కోట్ల)కు క్షీణించింది. దీంతో అంబానీ, అదానీల సంపద 100 బిలియన్ డాలర్ల మార్క్ కంటే దిగువకు పడిపోవడంతో 'సెంటీబిలియనీర్ క్లబ్' నుంచి తప్పుకున్నారు.
అయితే, వీరు కాకుండా దేశంలోని చాలామంది సంపన్నుల సంపద పెరుగుతోందని బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ తెలిపింది. 20 మంది బిలీయనీర్ల సంపద ఈ ఏడాదిలోనే 67.3 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లకు పైనే) పెరిగింది. 10.8 బిలియన్ డాలర్లతో హెచ్‌సీఎల్ టెక్ శివ్ నాడార్, 10.1 బిలియన్ డాలర్ల సంపద వృద్ధితో జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ ఎక్కువ పోగుచేసుకున్నారు.