- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా పేరు నిలపాలి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికి రాష్ట్రప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం నుండి గురువారం వరకు నిర్వహించే సీఎం క్రీడా కప్ జిల్లా పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, క్రీడలుశారీరక దారుఢ్యంతో పాటు,సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదం చేస్తాయని అన్నారు. ఈ నెల 19 వరకు జిల్లా స్థాయిలో పోటీలు ఎంపిక నిర్వహిస్తున్నట్లు,20 న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన హ్యాండ్ బాల్,వాలీబాల్ పోటీలు,అలాగే రాష్ట్ర స్థాయి కబడ్డీ,నెట్ బాల్ పోటీలను కూడా ఇక్కడే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
జిల్లా స్థాయిలో 36 క్రీడలను నిర్వహిస్తున్నాం...
మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ..జిల్లా స్థాయిలో 36 సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబంలోని విద్యార్థులను ప్రోత్సహించి,వారి ప్రతిభను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి,మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్,శాంతాభాయి,కురుమూర్తి గౌడ్,జాకీర్,తదితరులు పాల్గొన్నారు.