- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పినవన్నీ చేస్తాం…కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి : ఎమ్మెల్యే
దిశ, మెదక్ ప్రతినిధి : అభివృద్ధి చేస్తామని చెప్పాం.. చేసి చూపిస్తున్నమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ మెడికల్ కళాశాల లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి అభివృద్ధిని విస్మరించారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొబ్బరికాయలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాల మంజూరు చేసి వారిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్థం మెడికల్ కళాశాల ఆవరణలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో క్యాంటీన్ ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, ఏడుపాయల, చర్చి, పోచారం అభయారణ్యం ను సర్క్యూట్ టూర్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఇచ్చిన హామీలతో పాటు నియోజక వర్గంలో ప్రజల అవసరాలు గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు కాంగ్రెస్ నేతలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ లు రాజలింగం, శేఖర్, ముత్యం గౌడ్, డాక్టర్ శివదయాల్, ఉమర్, భాణి తదితరులు ఉన్నారు.