తాళాలు పగలగొట్టి బంగారం చోరీ

by Kalyani |

దిశ , కంగ్టి : తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు నగలు, నగదు చోరీ చేసిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కంగ్టి మండల పరిధిలోని దేగుల్ వాడి గ్రామానికి చెందిన ధనరాజ్ అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పని నిమిత్తం తమ సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడగా 5 తులాల బంగారం , లక్ష రూపాయలు దొంగిలించినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో ఇంట్లో ఎవ్వరు ఉండకపోవడాని గమనించిన దుండగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story