PUSHPA-2 : RRR రికార్డ్ బ్రేక్ చేసిన "పుష్పరాజ్"

by M.Rajitha |   ( Updated:2024-12-16 15:45:17.0  )
PUSHPA-2 : RRR రికార్డ్ బ్రేక్ చేసిన పుష్పరాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్(Allu Arjun-Sukumar) కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2'(Pushpa-2) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్​ఫుల్ షోస్​తో రన్ అవుతోంది. కలెక్షన్స్ లో పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. గత రెండు రోజుల వరకు రూ.1200 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా, తాజాగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'(RRR) ఓవరాల్​కలెక్షన్స్ రికార్డ్​ బ్రేక్ చేసింది. 2022లో రిలీజైన ఆర్ఆర్ఆర్ ఓవరాల్​గా రూ. 1300 కోట్లు వసూల్ చేయగా, పుష్ప 11 రోజుల్లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం పుష్ప-2 వరల్డ్​వైడ్​గా రూ.1409 కోట్లు వసూళ్లు సాధించి సూపర్ సక్సెస్ తో పరుగులు పెడుతోంది. దీంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా కొనసాగుతోంది. మూవీ మేకర్స్ ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. లాంగ్​రన్​లో పుష్ప వసూళ్లు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.



Read More...

‘తగ్గేదే లే కాదు.. కొంచం తగ్గు’.. ఆలోచింపజేస్తున్న బన్నీ అభిమాని మాటలు (వీడియో)






Advertisement

Next Story