Jamili Election: రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు

by Gantepaka Srikanth |
Jamili Election: రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌(Central Cabinet) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం లోక్‌సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లు(One Nation One Election Bill)ను ప్రవేశ పెట్టనున్నది. కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే(Arjun Ram Meghwal) ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి పంపనున్నారు. అయితే.. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ(NDA)కు 293 మంది ఎంపీల మద్దతు ఉన్నది. విపక్ష ఇండియా కూటమి(India)కి 235 మంది ఎంపీల బలం ఉన్నది. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో పలు మార్పులు చోటుచేసుకొని పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. ప్రస్తుతం మరోసారి కేంద్రం జమిలి నినాదం ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed