Pushpa-2 నుంచి పీలింగ్స్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసిన చిత్ర బృందం..!

by Anjali |   ( Updated:2024-12-16 10:34:25.0  )
Pushpa-2 నుంచి పీలింగ్స్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసిన చిత్ర బృందం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప-2’(Puṣpha). ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఫహాద్‌ ఫాజిల్(Fahad Fazil), అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), సునీల్(Sunil) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించి.. ప్రజల్ని మెప్పించారు. డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన పుష్ప-2 క్రేజ్ ఇంతవరకు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే పుష్ప-2 కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్(Famous music director Devisree Prasad) సంగీతాన్ని సమకూర్చిన పీలింగ్స్ ఫుల్ సాంగ్ వీడియో(Peelings Full Song Video)ను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Advertisement

Next Story

Most Viewed