Upendra: తెలుగు సినిమా స్థాయి మారిపోయింది.. స్టార్ హీరో కామెంట్స్

by sudharani |
Upendra: తెలుగు సినిమా స్థాయి మారిపోయింది.. స్టార్ హీరో కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ (Kannada) సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూఐ’ (UI). ఉపేంద్ర కెరీర్‌లోనే భారీ బడ్జెట్ (huge budget)గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ (Crazy Project)కు లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘యూఐ’ చిత్రం నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ (Promotional Content)తో పాటు ఇటీవల వచ్చిన ట్రైలర్ (Trailer)కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో మూవీపై రోజు రోజుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులఓ భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపేంద్ర తెలుగు సినిమాలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

‘1995లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో సినిమా చేయాలని ఏడాదిపాటు నేను స్క్రిప్టు (script)తో తిరిగాను. అయితే ఇక్కడి నటులు సినిమాలోని కథ, డైలాగ్స్ చాలా లోతుగా ఆలోచించి ఓకే చేస్తారని ఆ సమయంలో అర్థం అయింది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆ సమయం నుంచి నేను రెడీ చేసే స్క్రిప్టు విషయంలో చాలా మార్పులు చేసుకున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) సినిమాలు దేశం దాటి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. రూ. 1000 కోట్లు, రూ. 2000 కోట్లు సులువుగా కలెక్షన్స్ (Collections) సాధించే దిశగా తెలుగు పరిశ్రమ వెళ్తుంది. టాలెంట్ ఉంటే చాలు భాషతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లు అభిమానిస్తారు. మీరు ఆదరించే వారిలో నేను కూడా ఒకరిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed