కచ్చితంగా 2025లో పెళ్లి చేసుకుంటాను.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
కచ్చితంగా 2025లో పెళ్లి చేసుకుంటాను.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్(Amritha Aiyer) ‘30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రెడ్, లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ ఏడాది తేజ సజ్జా(Teja Sajja) సరసన ‘హనుమాన్’(Hanuman) మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు జై హనుమాన్, బచ్చల మల్లి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా నటించిన ‘బచ్చల మల్లి’ డిసెంబర్ 20 న విడుదల కానుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమృత అయ్యర్(Amritha Aiyer) పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ‘‘వచ్చే ఏడాది నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయాను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని నా ఫీలింగ్. అందుకే చేసుకోవద్దు అనుకుంటున్నాను. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమృత అయ్యర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed