- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Beerla Ilaiah: రైతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా?
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAs)లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ(Telangana Assembly)లో మాట్లాడారు. రాష్ట్ర టూరిజంపై చర్చ పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్(BRS) తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బీఏసీ కమిటీ(BAC Committee)లో చర్చ జరుపకుండా పారిపోయారని సెటైర్ వేశారు. కనీసం సభాపతికి కూడా మర్యాద ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏనాడూ రైతులకు న్యాయం చేయలేదని గుర్తుచేశారు.
రైతుల చేతులకు బేడీలు వేసిన నాయకుల నుంచి తాము నేర్చుకోవాలా? మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు అందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో జరుగుతున్న బీఏసీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్నిరోజులు నడుపుతారు అనేదానిపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇవ్వకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) వెల్లడించారు. వీరితో పాటుగా MIM నేతలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.