దళితులంటే ఎందుకంత చిన్నచూపు : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

by M.Rajitha |
దళితులంటే ఎందుకంత చిన్నచూపు : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : జోగుళాంబ జిల్లాలోని ఓ దళితవాడలో వారం రోజుల నుండి కరెంట్ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అయిజ మండలం పులికల్ గ్రామంలో బీసీ కాలనీలకు మాత్రం కరెంటు ఉండి, దళిత వాడ ప్రజలు వారం నుండి చీకట్లో మగ్గుతుంటే కాంగ్రెస్ నాయకులకు గాని, అధికారులకు గాని చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. వారు దళితులు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని.. దళితులంటే సీఎంకి, డిప్యూటీ సీఎంకు ఎందుకింత చిన్నచూపు అని నిలదీశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, 24 గంటలు కరెంటు అందిస్తున్నామని అబద్దాలు చెబుతున్నారని, దానికి ఈ దళితవాడే సాక్ష్యం అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాగా దళితవాడ నివాసులు మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని కాలనీలకు కరెంటు ఉంది, మాకు మాత్రం వారం నుండి కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నామని అన్నారు. రాత్రిపూట పాములు, తేల్ల భయంతో గడుపుతున్నామని, సర్పంచ్ ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదని వాపోయారు.

Next Story

Most Viewed