గురుకుల విద్యార్థుల మరణాలపై కేటీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు

by M.Rajitha |
గురుకుల విద్యార్థుల మరణాలపై కేటీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజనింగ్ జరిగి మరణించిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పాడ్డాక ఇప్పటివరకు 36 మంది గురుకుల, సాంఘిక సంక్షేమ విద్యార్థులు మరణించారని, దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రుల పాలయ్యారని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబంలో పిల్లలు ఉంటారని వారిని కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని దుఖఃమన్నారు. గురుకుల, సంక్షేమ హాస్టళ్లలకు పిల్లల్ని పంపే తల్లిదండ్రులు అక్కడి సిబ్బందే అమ్మానాన్న అయి వారిని జాగ్రత్తగా చూసుకుంటారని నమ్ముతారని, కానీ ఇపుడు ఆ తల్లిదండ్రులకు మీ బిడ్డ చనిపోయాడు అని చెప్తే వాళ్ళ గుండెకోత మాటల్లో చెప్పలేనిది అని భావోద్వేగానికి గురయ్యారు. ఇకనైనా ప్రభుత్వం సంక్షేమ, గురుకుల పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. విద్యార్థుల మరణాల పట్ల సీఎంకు గాని, మంత్రులకు గాని ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం అన్నారు.

Next Story

Most Viewed