- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ప్రకటన తప్ప పైసా రాలే'.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకు పోలింగ్ ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం ఇంకా తగ్గడం లేదు. పార్టీల మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రూ.10 లక్షల కోట్ల నిధులు కేటాయించి వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటుపడిందని కిషన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు కేటీఠఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ను ప్రశ్నించారు. ఒక్క వరంగల్ జిల్లాకు రూ.10 లక్షల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉత్తుత్తి 20 లక్షల కోట్లు.. ఉద్దీపన ప్యాకేజీ ల మాదిరిగానే ఉంటుందని, ప్రధాని ప్రకటన తప్ప ప్రజలకు ఒక్క పైస రాలేదని ధ్వజమెత్తారు.
కాగా శనివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పై ఎలక్షన్ సందర్భంగా కిషన్ రెడ్డి హనుమకొండలో జరిగిన ఓ ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి మోడీ కృషి చేశారని వెయి స్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పునరుద్ధరించామని చెప్పారు. దేశంలో 7 మెగా టెక్స్ టైల్స్ ఉంటే అందులో ఒకటి వరంగల్ కు తీసుకువచ్చామని చెప్పారు. అలాగే రైల్వే వ్యాగన్ కు శంకుస్థాపన చేసుకుని పనులను వేగవంతంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ పై విధంగా ప్రశ్నించారు.