Krishna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం, సాగర్ డ్యామ్ గేట్లు మళ్లీ ఓపెన్

by Shiva |   ( Updated:2024-08-30 04:53:06.0  )
Krishna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం, సాగర్ డ్యామ్ గేట్లు మళ్లీ ఓపెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రం కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 10 గేట్లను పది అడుగుల మేర మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం ఆ నీరంతా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీల వద్ద ఉంది. శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్న నీటితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. దీంతో అధికారులు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed