కొండపోచమ్మ సాగర్ ప్రమాదం... సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by M.Rajitha |   ( Updated:2025-01-11 10:26:01.0  )
కొండపోచమ్మ సాగర్ ప్రమాదం... సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట(Siddipeta) జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో(Kondapochammasagar) పడి ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన యువకులను వెలికి తీయాలని అధికారులకు సూచించారు. తక్షణమే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిపై తనకు సమాచారమివ్వాలని తెలియ జేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన యువకులు కొండపోచమ్మ సాగర్ చూడటానికి వెళ్ళి, ప్రాజెక్ట్ లోకి దిగి సెల్ఫీలు తీసుకుంటుండగా.. ఏడుగురు యువకులు సాగర్లో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు క్షేమంగా బయట పడగా.. ఐదుగురు యువకులు ఈతరాక మునిగి పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు .

Next Story

Most Viewed