- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Komati Reddy : BJP వైపు బీఆర్ఎస్ అడుగులు అందుకే కేసీఆర్ సైలెంట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ బడ్జెట్‌పై గగ్గోలు పెడుతున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బడ్జెట్‌లో అన్యాయం చేస్తే కేంద్రంపై ఇప్పటికి కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ఖండించారని గుర్తు చేశారు. బీజేపీ వైపు బీఆర్ఎస్ అడుగులు పడుతున్నాయి కాబట్టే తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెట్టినా.. ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఏపీ, బీహార్‌లలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినందుకే భారీగా నిధులు కేటాయించారన్నారు. వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. ఆ భయంతోనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపిందన్నారు. తాము నీతి అయోగ్ మీటింగ్‌కు అసెంబ్లీలోనే తేల్చి చెప్పామని.. కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ రంగానికే రూ.73 వేల కోట్లు బడ్జెట్‌లో తాము ఉంచామని అయినా బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేవలం 6 నెలల కోసమే తమ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్‌లో పెట్టిందని.. చెప్పిన పథకాలతో పాటు కొత్త వాటిని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.