- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ.. చర్చించిన అంశాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ (తెలంగాణ జన సమితి) చీఫ్ కోదండరాం శుక్రవారం కరీంనగర్ వీపార్క్ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరాంను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా.. కోదండరాం పోటీకి ఆసక్తి చూపలేదని తెలిసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ కోసం రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్ని కలవాలని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని టీజేఎస్ నిర్ణయించిందన్నారు. ఇక, పొత్తులో భాగంగా కాంగ్రెస్ వీక్‌గా ఉన్న అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోదండరాం రాహుల్‌ను కోరినట్లు తెలిసింది. జహీరాబాద్, కోరుట్ల, ఎల్లారెడ్డి, ముథోల్ టికెట్లను టీజేఎస్ ఆశిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ తో కోదండరాం భేటీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Read More..
కాంగ్రెస్ గ్రాఫ్‌పై కేసీఆర్ ఆందోళన.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు