అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశా.. క్లారిటీ ఇచ్చిన కేకే

by Satheesh |
అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశా.. క్లారిటీ ఇచ్చిన కేకే
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కే కేశవరావు ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్య సభ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు.. ఈ మేరకు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌కర్‌కు గురువారం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ పదవికి రిజైన్ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికైన ఎంపీ పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు.

నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి రాజ్య సభ సభ్యత్వానికి రిజైన్ చేశానని వెల్లడించారు. ఎంపీగా తన పదవి కాలం మరో రెండేళ్లుగా ఉండగానే రాజీనామా చేశానని తెలిపారు. కాగా, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన కేకే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కేకేను ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు కేకే తిరిగి పదేళ్ల తర్వాత సొంతగూటికీ చేరుకున్నారు.

Next Story

Most Viewed