కష్టాల్లో ఉన్న ఆ సింగర్‌కు ఏకంగా 25 లక్షల ఆర్థిక సాయం చేసిన స్టార్ హీరో.. నెట్టింట ప్రశంసల జల్లు!

by Kavitha |
కష్టాల్లో ఉన్న ఆ సింగర్‌కు ఏకంగా 25 లక్షల ఆర్థిక సాయం చేసిన స్టార్ హీరో.. నెట్టింట ప్రశంసల జల్లు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇతన్ని భారతీయ జాకీ చాన్ అని అంటారు. ఇక అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ ఓ సింగర్‌కి ఏకంగా 25 లక్షలు దానం చేసాడనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌కి చెందిన పద్మ భూషణ్ అవార్డు గ్రహిత సింగర్ గుర్మీత్ బవా కూతురు గ్లోరీ బవా. ఈమె తన తల్లి మరణించాక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో గ్లోరీ బవా ఇటీవల తన సోషల్ మీడియాలో తాను చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నాను. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. ఇక ఈమె సింగర్ కావడంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారి ఈ విషయం అక్షయ్ కుమార్ దాకా వెళ్లింది. దీంతో అక్షయ్ కుమార్ గ్లోరీ బవాకు ఏకంగా 25 లక్షలు సహాయం చేసాడు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. ఈ విషయం నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. గుర్మీత్ బవా పంజాబ్‌లో గొప్ప సింగర్. ఆమె పాటలు నేను వినేవాడిని. ఆమె కూతురు ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉందని తెలిసి బాధపడ్డాను. అందుకే ఒక అన్నయ్యగా ఆమెకు సహాయం చేశాను అని తెలిపాడు.

ఇక అక్షయ్ కుమార్ చేసిన సహాయంపై గ్లోరీ బవా మాట్లాడుతూ.. అక్షయ్ కుమార్ చేసిన సహాయం నేను మర్చిపోలేను. మా అమ్మ పాటలు ఆయన విని ఉంటారు. అన్నయ్యగా నాకు ఈ సహాయం చేస్తానని తెలిపారు. నేను ఆయనకు రాఖీ కట్టి నిజంగానే అన్నయ్యని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ డబ్బుతో నా ఆర్థిక కష్టాలు తీరిపోతాయి. నేను పని చేసుకుని బతుకుతాను అని తెలిపింది. దీంతో అక్షయ్ కుమార్ మంచి మనసుకి అందరూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed