తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. చర్చకు సిద్ధమా? రేవంత్

by GSrikanth |   ( Updated:2024-05-04 15:00:24.0  )
తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. చర్చకు సిద్ధమా? రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణకు యూపీఏ(UPA), ఎన్డీఏ(NDA) ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. కొడంగల్‌లో లేదా? రాష్ట్ర అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. అర్థవంతమైన చర్చకు ఆహ్వానిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకివచ్చి మోడీ ప్రధాని కాగానే ఈ దశాబ్దకాలంలో తెలంగాణ ఎలా అభివృద్ది చేశామో బహిరంగ చర్చకు తాను సిద్దమన్నారు. అది రోడ్ల అభివృద్ది, రైల్వే నెట్వర్క్, రైతుల అభివృద్ది, సంక్షేమ పథకాలు ఇలా ఏ విషయంలోనైనా కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఏమి వచ్చింది.. బీజేపీ హయాంలో ఏమి చేశామో చూపించేందకు సిద్దం అన్నారు. సీఎం రేవంత్‌ సిద్ధమా అని కిషన్‌రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు.

Read More..

దొంగ సార, కల్తీ కల్లు అమ్ముకునే వారు కూడా నన్ను విమర్శిస్తారా?.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story