- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్.. ఏ మొఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు.. కిషన్ రెడ్డి రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాహుల్ ఏ మొఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెస్సేనని, తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్‌దని ఆరోపించారు. తెలంగాణకు వచ్చిన ఒక కాంగ్రెస్ మంత్రి హోటల్‌లో డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ కర్ణాటకలో డబ్బులు వసూలు చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ ఇస్తామని చెప్పి ఆనాడు వెనక్కి వెళ్లిపోవడంతో యువత ఆత్మహత్య చేసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు సాగునీటి కేటాయింపులు తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పీడను వదిలించాలన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశానికి, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదన్నారు. బీజేపీ మాత్రమే నీతివంతమైన పాలన చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.