కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడేందుకు ఎమ్ హక్కు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడేందుకు ఎమ్ హక్కు ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి వరకు తెలంగాణలోని రైతులకు రైతు భరోసా అందిస్తామని.. దీనిపై అసెంబ్లీలో చర్చించి.. విదివిదానాలు రూపొందిస్తామని పేర్కోన్నారు. ఈ క్రమంలో బీజేపీ విడుదల చేసిన ఛార్జ్ షీట్ పై మీ స్పందన ఎంటని.. ఓ రిపోర్టర్ సీఎం ను ప్రశ్నించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి.. తెలంగాణ గురించి ప్రశ్నించేందుకు ఎమ్ హక్కు ఉందని.. ఆయన గుజరాత్ కు బానిస అని.. అందుకే గుజరాత్ వెళ్తున్నానని గతంలో కిషన్ రెడ్డి చెప్పారంటూ వ్యాఖ్యానించారు.

అలాగే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గతంలో ఇచ్చిన హామీలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని,, మా మంత్రులు చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే మరో రిపోర్టర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రాష్ట్రంలో తేలిపోయిందని.. ఆ పార్టీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్ర ప్రజలకు మొత్తం ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారని దీనిపై మీ స్పందన ఎంటని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కాకి పిల్ల కాకికి ముద్దు అంటూ సమాధానం ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed