Kishan Reddy: తెలంగాణ బీజేపీకి 2024 చాలా స్పెషల్

by Gantepaka Srikanth |
Kishan Reddy: తెలంగాణ బీజేపీకి 2024 చాలా స్పెషల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతుతోనే మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ భాగస్వామ్యమైందన్నారు. రాష్ట్రంలో పోలయినటువంటి మొత్తం ఓట్లలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం ఓట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపిందన్నారు.

బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు 2025 లోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. 2025 లో ప్రజలందరికీ మంచి చేకూరాలని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నరేంద్రమోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Advertisement

Next Story