- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీ క్లీనిక్ లో మందులు లేక ఇటు విశ్రాంత ఉద్యోగులు,అటు రెగ్యులర్ కార్మికుల అవస్థలు వర్ణనాతీతమని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు విచారం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్ కు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించారు. బీపి,మధుమేహం,గుండె జబ్బులు,కీళ్ళ నొప్పులు లాంటి అనేక దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నామని,గత మూడు నెలలుగా ఆర్టీసీ క్లీనిక్ లో మందులు రావడంలేదని,అతి కొద్ది పెన్షన్ తో మందులు కొనలేకపోతున్నామన్నారు. అనేక సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆయన వాపోయారు. అలాగే,రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని,కారుణ్య నియామకాలను భర్తీ చేయాలనే తదితర అనేక సమస్యలను ఆయన ఆర్ఎం తో ప్రస్థావించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భగవంతు,నాగాంజనేయులు,లలితమ్మ,టీఎస్ఎస్ రెడ్డి,మనోహర్,కెఆర్ రెడ్డి,డేవిడ్, హతదితరులు పాల్గొన్నారు.