ఆదిలాబాద్ లో ఘనంగా శ్రీరామ పల్లకి ఊరేగింపు

by Sridhar Babu |   ( Updated:2025-01-05 13:08:00.0  )
ఆదిలాబాద్ లో ఘనంగా శ్రీరామ పల్లకి ఊరేగింపు
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీరామ పల్లకి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించగా దీనికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి. దాంతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేవుని నామస్మరణతో ఆధ్యాత్మికత చోటుచేసుకోగా శోభాయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఎమ్మెల్యే, ప్రసంగించారు.

Advertisement

Next Story