Minister Satya Kumar: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు నమోదు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

by Shiva |
Minister Satya Kumar: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు నమోదు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా (China)లో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ (HMPV Virus) కేసులు తాజాగా భారత్‌ (India)లోనూ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక (Karnataka), తమిళనాడు Tamilnadu), మహారాష్ట్ర (Maharashtra), గుజరాత్ (Gujarat) రాష్టాల్లో పాజిటివ్ కేసులను ఐసీఎంఆర్ (ICMR) గుర్తించింది. ఈ క్రమంలోనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar) ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. పోరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు అవుతుండటంతో తాము కూడా అప్రమత్తమయ్యామని తెలిపారు. హెచ్ఎంపీవీ కేసుల గురించి పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

అదేవిధంగా ఉన్నతాధికారులతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించామని అన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటుపై సమీక్షించామని పేర్కొన్నారు. ప్రతి హాస్పిటల్‌లో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV virus) బారిన పడిన వారి కోసం 20 బెడ్లతో ఐసోలేట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. అదేవిధంగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు ఐసీఎంఆర్ (ICMR) జనరల్ అడ్వైజరీ మాత్రమే ఇచ్చిందని మంత్రి సత్య కుమార్ అన్నారు.

Next Story

Most Viewed