Canada: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన వ్యక్తులు

by Shamantha N |
Canada: కెనడా ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన వ్యక్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్‌ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. దీంతో కెనడా (Canada) ప్రధాని ఎవరనేది ఇంట్రెస్టింగ్ మారింది. అయితే, 8 మంది ప్రధాని రేసులో ఉండగా.. అందులో ఇద్దరు భారత సంతతి నేతల కూడా ఉన్నారు. ప్రధాని రేసులో లిబరల్‌ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్‌, మార్క్‌ కార్నీ, డొమినిక్‌ లీ బ్లాంక్‌, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్‌ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్‌, జార్జ్‌ చాహల్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

అనితా ఆనంద్‌..

రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్‌ (Indian Origin MP Anita Anand) ప్రధాని రేసులో ఉన్నారు. తమిళ్‌, పంజాబీ మూలాలున్న 57ఏళ్ల అనితా ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పని చేయగా.. ఆ తర్వాత రెండేళ్ల పాటు రక్షణమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అనిత తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ కాగా.. తల్లి పంజాబీకి చెందిన డాక్టర్.

జార్జ్‌ చాహల్‌..

భారత సంతతికి చెందిన జార్జ్ చాహల్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. సహజ వనరులపై ఏర్పాటుచేసిన స్టాండింగ్‌ కమిటీకి చాహల్ నేతృత్వం వహించారు. సిక్కుల కాకస్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే, చాహల్‌ను లిబరల్‌ పార్టీ లెజిస్లేటివ్‌ కాకస్‌ తాత్కాలిక నేతగా నియమించింది. దీంతో, ఆయన పార్టీ నాయకుడిగా గెలిచినా ప్రధాని పదవి చేపట్టేందుకు వీలుకాదని సమాచారం. తాత్కాలిక నేతలు ప్రధాని పదవి చేప్టటేందు కెనడా చట్టాల ప్రకారం వీలుకాదు.

Advertisement

Next Story

Most Viewed