విషాహారం తిని విద్యార్థుల అస్వస్థత..

by Sumithra |
విషాహారం తిని విద్యార్థుల అస్వస్థత..
X

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ శర్మ నగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ హస్టల్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది విద్యార్థులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 23 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు.

అయితే విద్యార్థులు రాత్రి కాలీఫ్లవర్, సాంబార్ తో భోజనం చేసి స్టడీ అవర్స్ ముగించుకుని వారి వారి గదుల్లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. ఇదే సమయంలో కడుపు నొప్పి రావడం, వాంతులు కావడంతో ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున విరేచనాలు కావడంతో గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed