పోలీస్ ఎస్కార్ట్ వాహనం బోల్తా..

by Kalyani |
పోలీస్ ఎస్కార్ట్ వాహనం బోల్తా..
X

దిశ, జనగామ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో ఎస్కార్టు విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాథమిక అవగాహన ప్రకారం జనగామ జిల్లాకి మధ్యాహ్నం 3:20 గంటల నిమిషాలకు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం కాన్వాయ్ జనగామ మండలం పెంబర్తి అర్చి జిల్లా బోర్డర్ వద్దకు రాగానే అర్చి వద్ద జనగామ ఎస్ ఐ చెన్నకేశవులు పోలీస్ వాహనం(TS 09 PA 2278) ఎస్కార్ట్ గా ముందుకు వెళ్ళగానే కాన్వాయ్ లో ఉన్న తెలుపు కలర్ వాహనం ఎస్ ఐ వాహనానికి తాకే లాగా వచ్చింది. దీంతో ప్రైవేటు డ్రైవర్ సాగర్ పోలీసు వాహనం 120 స్పీడ్ లో ఎడమ వైపుకు తిప్పగా, రోడ్డు దిగి పక్కన చెట్లలోకి దూసుకొని వెళ్ళింది అని ప్రాథమిక అంచనా..ఈ సంఘటనలో ఎస్ఐ చెన్నకేశవ్ కు డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసు వాహనం డ్యామేజ్ అయ్యింది. భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం కాన్వాయ్ యథావిధిగా వెళ్ళిపోయింది.

Advertisement

Next Story

Most Viewed